సత్యవేడు మండలం వెంకటరాజుల కండ్రిగ చెక్ పోస్ట్ వద్ద శనివారం రోడ్డుకు అడ్డంగా చెట్టు నేలకొరిగింది. ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక సీఐ మురళినాయుడు సూచన మేరకు ఎస్ఐ రామస్వామి ఘటనా స్థలానికి చేరుకున్నారు. సర్పంచ్ సుజాత, గ్రామస్థుల సహకారంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్టును పోలీసులు తొలగించారు.