సత్యవేడు మండలం మదనంబేడు అటవీ ప్రాంతంలో శనివారం ఉపాధిపనుల కోసం వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో 6 మంది అస్వస్థతకు గురై సత్యవేడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు కూలీలు గోపి, సుజాత పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని తిరువళ్లూరు ఆసుపత్రికి తరలించారు. బాధితులకు వైద్య ఖర్చులకు ప్రభుత్వం సహాయం చేయాలని కూలీలు డిమాండ్ చేస్తున్నారు.