సత్యవేడు: ఉలవచేనులో కార్డన్ సెర్చ్

64చూసినవారు
సత్యవేడు: ఉలవచేనులో కార్డన్ సెర్చ్
సత్యవేడు మండలంలోని ఉలవచేను కాలనీలో పోలీసులు ఆదివారం కార్డన్ సెర్చ్ చేపట్టారు. సీఐ మురళినాయుడు సూచనలతో ఎస్ఐ రామస్వామి ఆధ్వర్యంలో పోలీసులు కాలనీలో ప్రతి మూలను తనిఖీ చేశారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాల రికార్డులు, నివాస ఆధార్ కార్డులు పరిశీలించగా, కొన్నివాహనాలకు పత్రాలు లేకపోవడంతో జరిమానాలు విధించారు. అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానితులపై వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్ఐ సూచించారు.

సంబంధిత పోస్ట్