శ్మశానాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేయూతనందిస్తుందని సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. బుధవారం నారాయణనం పంచాయతీలో నిర్మించిన శ్మశాన వాటిక ప్రహరీ గోడ, దహన వాటికలను ఆయన ప్రారంభించారు. అభివృద్ధి చేయవలసిన శ్మశానాల వివరాలను తన దృష్టికి తీసుకొస్తే నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.