ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ ను కోరారు. శుక్రవారం ఉదయం పిచ్చాటూరు, నాగలాపురంలలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన ప్రజా ఆరోగ్య కేంద్ర భవనాల ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.