సత్యవేడు మండలం దాసుకుప్పం సబ్ స్టేషన్ ప్రాంతాల్లోని గ్రామాలకు రేపు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు స్థానిక విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సబ్ స్టేషన్ మరమ్మతు పనులు, విద్యుత్ తీగలు సరి చేయడం వంటి పనులను చేపడుతున్న కారణంగా గృహ, వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు అధికారులు చెప్పారు.