సత్యవేడు: ఉచిత వైద్య శిబిరానికి స్పందన

52చూసినవారు
సత్యవేడు: ఉచిత వైద్య శిబిరానికి స్పందన
సత్యవేడు నియోజకవర్గం బీఎన్ కండ్రిగ మండలంలోని కారణిమిట్ట గ్రామంలో శ్రీకాళహస్తి ఎంజీఎం ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి స్పందన లభించింది. ఈ సందర్భంగా సర్పంచి పద్మమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలువురు విష జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీంతో ఎంజీఎం ఆసుపత్రివారు వైద్యశిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఉచితంగా మందులుపంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్