సిఎం చంద్రబాబు మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ అమలు చేయలేదని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి ఆదివారం ధ్వజమెత్తారు. నాగలాపురంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మ్యానిఫెస్టోపై వీడియో విడుదల చేశారు. చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు తెలపాలని పార్టీ శ్రేణులను కోరారు. ప్రజలు ఇప్పటికే చంద్రబాబు పాలనపై విసిగిపోయారన్నారు. ఈ నెల 9 న చిత్తూరు జిల్లా జగన్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.