సత్యవేడు జ్యుడీషియల్ కోర్టు ప్రాంగణంలో వాహనాల పార్కింగ్పై నిషేధం విధిస్తున్నట్టు స్థానిక ఎస్సై రామస్వామి చెప్పారు. కోర్టు ముందు భాగంలో ఎవరు కూడా వాహనాల పార్కింగ్కు అనుమతి లేదన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం కోర్టుకు ముందు భాగంలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఎవరైనా ఇక్కడ వాహనాలు పార్కింగ్ చేస్తే చట్టపరకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.