కేవీబీపురం మండలంలోని కోవనూరు గ్రామ పంచాయతీకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు రామయ్య మృతిచెందారు. ఈ సందర్భంగా విషయం తెలుసుకున్న టీడీపీ మండల అధ్యక్షులు రామాంజులు నాయుడు ఆదివారం ఆయన భౌతిక కాయానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు రైతు అధ్యక్షులు కనపర్తి గోపీనాథ్ రెడ్డి పాల్గొన్నారు.