వరదయ్యపాలెం మండలంలోని అవంతి లెదర్స్ పరిశ్రమలో ఆదివారం తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి వైద్యాశాల వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మొత్తం 147 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 24 మందికి కంటి సంబంధిత ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో అవంతి లెదర్స్ పరిశ్రమ జనరల్ మేనేజర్ నార్ల లీలకృష్ణ తెలిపారు.