ఏర్పేడు మండలం గుడిమల్లం శ్రీ పరుశురామేశ్వర స్వామిని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ మాజీ ఛైర్మన్ బత్తుల గిరినాయుడు, ఆలయ ఈవో రామచంద్రారెడ్డిలు స్వాగతం ఏర్పాట్లు చేశారు. పరశురామేశ్వర స్వామి, ఆనందవల్లి అమ్మవారిని ఎండీ దర్శించుకున్న అనంతరం వారికి స్వామి వారి ఆశీర్వచనం, ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.