సత్యవేడు గంగ జాతర సందర్భంగా గురువారం మధ్యాహ్నం శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి గంగమ్మ దేవతను దర్శించుకున్నారు. జాతర నిర్వాహకులు అడ్వకేట్ గోపీనాథ్ ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ. సత్యవేడు సుభిక్షత కోసం కులమతాలకు అతీతంగా ఏటా ఘనంగా నిర్వహించే జాతరలో గంగమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.