శ్రీకాళహస్తిలోని టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం సీఎం సహాయనిది కింద చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు రూ. 20. 27 లక్షలు అందజేశామన్నారు. టీడీపీ సభ్యత్వం పొంది ప్రమాదాలకు గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.