పిచ్చాటూరులోని ఓ ప్రైవేటు కళ్యాణమండపంలో ఏడు మండలాల ఎంపీడీవోలు, ఏపీవోలు, ఏపీఎంలు, పశువైద్యాధికారులతో మంగళవారం సమీక్ష జరిగింది. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న గోకులం షెడ్డు, సబ్సిడీ లోన్స్ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారికి అందజేయాలన్నారు. ఆ బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.