తన భర్త ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై వచ్చిన ఆరోపణలు కరెక్ట్ కాదని గురువారం ఆయన భార్య తెలిపారు. టిడిపి వారు చేశారో, వైసిపి వారు చేశారో తెలియదని చెప్పారు. తనకు 1979 వ సంవత్సరంలో పెళ్లి అయ్యిందని ఇప్పటివరకు ఆయనకు చెడ్డ పేరు లేదని చెప్పారు. ఆయన చెడ్డవాడైతే గ్రామంలో చెప్పేవారని తెలిపారు. ఆయన ఉదయం 9 గంటలకు వెళితే, రాత్రి 9 గంటలకు వస్తారని చెప్పారు. ఆయన భర్తపై కుట్ర జరిగిందని తెలిపారు.