నూతన మద్యం పాలసీ అమలులో అధికారుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు అనధికార మద్యం విక్రయాలపై కఠిన హెచ్చరికలు చేసినప్పటికీ, సత్యవేడు మండలంలో బెల్ట్ షాపులు స్వేచ్ఛగా సాగిపోతున్నాయి. మల్లవారిపాలెం, రామచంద్రాపురం, ఇరుగులం, కొల్లడం, దాసుకుప్పం వంటి పలు గ్రామాల్లో బెల్ట్ షాపుల జోరు కొనసాగుతోంది. తమిళనాడు మద్యం అక్రమంగా రవాణా చేయబడుతోందన్న ఆరోపణలతో ఎక్సైజ్ అధికారులు విమర్శల పాలవుతున్నారు.