మంత్రి అనగాని సత్యప్రసాద్ సోమవారం సత్యవేడుకు రానున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. ‘సుపరిపాలనకు తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.