
జమ్మూ మొత్తం సైరన్ల మోత: J&K సీఎం
జమ్మూ వ్యాప్తంగా పూర్తి బ్లాక్ అవుట్ కొనసాగుతోందని J&K సీఎం ఒమర్ అబ్దుల్లా 'X' వేదికగా తెలిపారు. నగరం మొత్తం సైరన్ల మోత వినిపించిందని పేర్కొన్నారు. తాను ఉన్న ప్రాంతంలో ఫిరంగి పేలిన శబ్దం, పేలుళ్లు వినిపిస్తున్నాయని తెలిపారు. జమ్మూ ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, రాబోయే కొన్ని గంటల పాటు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. ఎలాంటి వదంతులను నమ్మొద్దని, నిరాధార వార్తలు ప్రచారం చేయవద్దన్నారు.