కేవీబీపురం మండలం వగతూరు ఎస్సీ కాలనీలో మృతిచెందిన వారిని శ్మశానికి తీసుకెళ్లడానికి దారి లేదని బుధవారం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల మీదుగా కంప చెట్లు, పిచ్చి మొక్కలు దాటి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. శ్మశానం విషయమై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఎస్సీ కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.