వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ ప్రభుదాస్ సోమవారం ఇరిగేషన్ ఏఈ బాబుకు వినతిపత్రం అందజేశారు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పంట కాలువలో పైపులు పెట్టి, దానిపై మట్టి పోసి పంట కాలువను ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. శాండ్ చెక్ పోస్టు వెనుక బాగాన, కారిపాకం రోడ్డు మలుపు వద్ద పంట కాలువ ఆక్రమణ జరుగుతుందని చెప్పారు. చర్యలు తీసుకోవాలని కోరారు.