వరదయ్యపాలెం: మండలంలో కుండపోత వర్షం

79చూసినవారు
తిరుపతి జిల్లా,  సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో గురువారం మధ్యాహ్నం కుండపోత వర్షం పడింది. ఉదయం అంతా ఎండ కాసినప్పటికీ ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. ఈ వర్షానికి వీధులన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడం వల్ల ప్రయాణికులకు రాకపోకలు కష్టతరంగా మారింది. మండలంలోని పొలాల్లో వర్షపు నీరు చేరింది.

సంబంధిత పోస్ట్