శ్రీకాళహస్తి, బీఎన్ కండ్రిగ, రేణిగుంట, తిరుచానూరు, పోలీస్ స్టేషన్ పరిధిలో 5 చోట్ల దొంగతనాలు పాల్పడిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన భరద్వాజన ప్రేముమార్ అనే నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 20 లక్షల విలువ చేసే 220గ్రా. బంగారం, 2180 గ్రా. వెండి, ల్యాప్టాప్, ఐఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శ్రీకాళహస్తి-1 టౌన్ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ నరసింహారావు వివరాలు వెల్లడించారు.