ఏర్పేడు మండలంలో అఖిలభారత పశుగణన

56చూసినవారు
ఏర్పేడు మండలంలో అఖిలభారత పశుగణన
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలోని ఆమందూరు పంచాయతీలో శుక్రవారం అఖిలభారత పశు గణన ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి పశువులను నమోదు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ ను ఇంటింటికీ వెళ్లి పాడి రైతులకు అందించారు. ఇంటింటికీ స్టిక్కర్ అంటించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ శిల్పారెడ్డి, పల్లం వెటర్నరీ అసిస్టెంట్ రాధిక పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్