శ్రీకాళహస్తిలోని కొత్తపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలో బుధవారం బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి 12వ అదనపు జిల్లా జడ్జి శ్రీనివాస్ నాయక్ వచ్చారు. న్యాయవాదులు, పట్టణ పోలీస్ అధికారులు, పారా లీగల్ వాలంటరీ, కోర్టు సిబ్బంది, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొన్నారు.