ఊరందూరు: చెన్నకేశవ స్వామి ఆలయంలో రథోత్సవం

53చూసినవారు
ఊరందూరు: చెన్నకేశవ స్వామి ఆలయంలో రథోత్సవం
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో బుధవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీచెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం రథోత్సవంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి, అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం ధూప దీప నైవేద్యం సమర్పించారు. గ్రామోత్సవం కన్నుల పండుగగా జరిగింది.

సంబంధిత పోస్ట్