తొట్టంబేడు మండలం బోనుపల్లి గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రైతులతో సమావేశం నిర్వహించారు. వారి వద్ద నుంచి వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రైతులకు అందుతున్న పథకాలు, సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగిందన్నారు. గతంలో జరిగిన రీ సర్వేలు సరిగ్గా జరగలేదని, 1 బిలు రాకపోవడం, వాటి పరిష్కారాలలో న్యాయం వంటి సమస్యలు ఉన్నట్టు తెలిపారు.