ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోండి: డీఎస్పీ

81చూసినవారు
ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోండి: డీఎస్పీ
శ్రీకాళహస్తి పట్టణంలోని రహదారులపై ఆక్రమణలను డీఎస్పీ నరసింహమూర్తి సిబ్బందితో కలిసి తొలగించారు. బుధవారం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని వీధి వ్యాపారస్తులకు సూచించారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐ తిమ్మయ్య, కానిస్టేబుల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్