ఏర్పేడు మండలం గుడిమల్లంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారిని చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య యాదవ్ కుటుంబ సభ్యులతో కలసి శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయ మాజీ ఛైర్మన్ బత్తలగిరి నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి రామచంద్రారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి ప్రత్యేక పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.