శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో శనివారం భారీ వర్షం కురుస్తోంది. వర్షానికి శీతకాలువ పైనుంచి వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ కారణంగా గుడిమల్లం గుడికి ఎవరూ రావద్దని, కాలువ దాటే ప్రయత్నం చేయొద్దని ఈవో రామచంద్ర రెడ్డి ప్రజలకు సూచించారు. గుడిమల్లం వెళ్లే దారిలో కాలువలు ప్రవహిస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు సూచించారు.