వృత్తిలో రాణించాలంటే జ్ఞానం, వికాసం, సామర్థ్యం, చురుకుదనం, నైపుణ్యం తప్పనిసరని సైకాలజిస్ట్ ఎన్.బీ. సుధాకర్ రెడ్డి అన్నారు. శనివారం ఏర్పేడు దగ్గర ఉన్న ఎస్ఓఎస్ బాలల గ్రామంలో విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చారు. పనిలో నాణ్యత కోసం పంచ సూత్రాలు పాటించాలన్నారు. చదువు మార్కులకు మాత్రమే కాకుండా కౌశలాలను పెంపొందించేందుకూ ఉపయోగపడాలని తెలిపారు.