ఏర్పేడు మండలం జంగాలపల్లిలోని ఐజర్ రీసెర్చ్ కేంద్రంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. కెమిస్ట్రీ ల్యాబ్‌లో విద్యార్థులు ప్రయోగాలు చేస్తుండగా మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. అధ్యాపకులు విద్యార్థులను తక్షణమే బయటకు పంపారు. ఈ క్రమంలో ల్యాబ్‌లో దట్టమైన పొగలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఘటనపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.