శ్రీకాళహస్తిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఒంటరి మహిళలే టార్గెట్‌గా నిందితులు మోసాలకు పాల్పడుతుండగా. శ్యామ్‌లాల్, కిషన్ అనే నిందితులు సునీత అనే మహిళను ట్రాప్ చేశారు. ఎక్కువ ధరకు బంగారం కొంటామని చెప్పి ఆమెకు భారీగా నకిలీ నోట్లు ఇచ్చారు. అనంతరం సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు. వారి వద్ద నుంచి రూ.11 లక్షల విలువైన బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు.