బీజేపీ సభ్యత్వంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్య దర్శి కోలా ఆనంద్ అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులతో గురువారం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ బీజేపీ సభ్యత్వంలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించేలా 50 వేలకు పైగా సభ్యత్వాలు సాధిద్దాం అని కార్య కర్తలకు పిలుపునిచ్చారు.