కాసారం-శ్రీకాళహస్తి మధ్య రూ.1.5 కోట్లతో నిర్మించిన KKG రోడ్డును బుధవారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం పాలనలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. నియోజకవర్గానికి రోజూ 9 గంటల విద్యుత్ సరఫరా కోసం చర్యలు ప్రారంభించామని తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభివృద్ధిపై దృష్టి సారించారని అన్నారు.