శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మంగళవారం పౌర్ణమి సందర్భంగా శివపార్వతులకు ఊంజల సేవ కన్నుల పండువగా జరిగింది. ముందుగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడిని వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. స్వామి వారిని ఆలయం నుంచి ఊరేగింపుగా పొన్న చెట్టు వద్దకు తీసుకొచ్చి ఊయలలో అధిష్ఠింపజేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఊంజల సేవ వైభవంగా జరిగింది.