పిచ్చాటూరు: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్

75చూసినవారు
పిచ్చాటూరు: మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్
మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని గురువారం అరెస్ట్ చేసినట్లు పిచ్చాటూరు ఏస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన వివరాల మేరకు. కారూరు దళిత వాడకు చెందిన శేఖర్ ఓ 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. విషయం బయట చెబితే చంపేస్తానని ఆమెను బెదిరించాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.

సంబంధిత పోస్ట్