అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై గురువారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. బాధితుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు వైద్యసహాయం అందించాలని కోరారు.