గిరిపుత్రులకు పీఎంయూ పూర్తిస్థాయిలో చేయూతనిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ పోగ్రాం ఆఫీసర్ కిరణ్ కుమార్ అన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని ఎర్రగుడిపాడు గిరిజన కాలనీలో గురువారం పీఎంయూ సిబ్బంది పర్యటించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎర్రగుడిపాడు గిరిజన కాలనీలో 55కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. వీరికి ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డులు లేవని తెలిపారు. ఫలితంగా వీరంతా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నట్లు వివరించారు.