తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంరేణిగుంట ప్రభుత్వ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రికి ధీటుగా తీర్చిదిద్దుతామని సోమవారం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. త్వరలోనే ఆస్పత్రిలో పర్యటిస్తామన్నారు. 4 నుంచి 6 నెలల లోపల ఆసుపత్రి రూపురేఖలు మార్చి చూపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో ఆ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేశారు.