ఏర్పేడు: పని ఒత్తిడి తగ్గించండి

66చూసినవారు
ఏర్పేడు: పని ఒత్తిడి తగ్గించండి
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు మంగళవారం ఎంపీడీవో సౌభాగ్యంను కలిసి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులకు పని ఒత్తిడి, పని భారం తగ్గించాలని కోరారు. సెలవు దినాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్