శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో ఆదివారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంజి కన్యమూల గణపతి ఆలయంలో ఎస్ఎంకే శీను గురుకుల్ ఆధ్వర్యంలో హోమాలు జరిగాయి. ముందుగా గణపతికి అభిషేకం చేసి, స్వామిని శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనానికి ఏర్పాటు చేశారు. భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు.