రేణిగుంట నారాయణ కాలేజీ ఎదురుగా శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఉద్యోగుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళా ఉద్యోగి(25) అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మందికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని అమర హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని రేణిగుంట అర్బన్ డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.