శ్రీకాళహస్తి: మృత్యుంజయ స్వామి వారికి అభిషేకాలు

67చూసినవారు
శ్రీకాళహస్తి: మృత్యుంజయ స్వామి వారికి అభిషేకాలు
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో మృత్యుంజయ స్వామికి సోమవారం సందర్భంగా విశేష అభిషేకాలు చేశారు. ముందుగా స్వామివారికి పాలు, పెరుగు, తేనె, గంధం, పంచామృతం వంటి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు. అనంతరం ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు లోకేశ్ రెడ్డి, నాగభూషణం, హరియాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్