ఈ నెల 9 న జరిగే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని శ్రీకాళహస్తిలో ఏఐటియుసి, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య మాట్లాడుతూ, సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం వారు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.