శ్రీకాళహస్తి: తప్పిపోయిన బాలుడిని సురక్షితంగా అప్పగించిన సీఐ

1806చూసినవారు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి చెందిన పసుపులేటి స్వామి, కల్పన కుటుంబ సమేతంగా దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో వారి కుమారుడు కార్తికేయ తప్పిపోయాడు. సీఐ తిమ్మప్ప సమాచారం అందుకొని బాలుడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్