తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వెలసిన ధర్మరాజుల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో ప్రధాన ఘట్టమైన దుర్యోధన, దుశ్శాసన వధ అధ్యంతం రసవత్తరంగా సాగింది. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజారులు కురులు ముడివేశారు. భీముడు, దుర్యోధనుడు వేష దారులు యుద్ధం కళ్లకు కట్టినట్టుగా వేశారు. ఈ కార్యక్రమం వీక్షించడానికి శ్రీకాళహస్తి పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేశారు.