శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజుల స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం అగ్నిగుండ ప్రవేశం మహోత్సవంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీ ధర్మరాజుల స్వామివారిని దర్శించుకున్నారు. ముందుగా అగ్నిగుండాన్ని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంకాలం జరిగే అగ్నిగుండంలో జాగ్రత్తలు పాటించాలని భక్తులను కోరారు.