శ్రీకాళహస్తి: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

7చూసినవారు
ముగ్గురు అంతరాష్ట్ర దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు శ్రీకాళహస్తి టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి శనివారం తెలిపారు. నకిలీ డబ్బులు ఆశ చూపి మహిళల నుంచి బంగారు నగలను దొంగల ముఠా ఎత్తుకెళ్లారని తెలిపారు. నిందితుల వద్ద సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 114 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితులను అరెస్టు చేసి తరలించడం జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్