శ్రీకాళహస్తి మండలం జగ్గురాజుపల్లి గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు వివరించారు. ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం వివిధ పథకాల లబ్ధిదారుల వివరాలను వెల్లడించారు.